ఫేస్ బుక్ నుంచి వాట్స్ యాప్, ఇన్ స్టాగ్రామ్ కు మెసేజ్... తీవ్ర కసరత్తు చేస్తున్న ఫేస్ బుక్!
- ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ మెసెంజర్ లతో అనుసంధానం
- ప్రైవసీకి భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటున్న ఫేస్ బుక్
- ఈ సంవత్సరం చివరికి సేవలందే అవకాశం
ప్రస్తుతం ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లూ వేర్వేరు యాప్ లుగా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడింటినీ అనుసంధానం చేసే ప్రయత్నాల్లో ఉన్న ఫేస్ బుక్, ఇందువల్ల వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతుందా? అన్న కోణంలో పరీక్షలు నిర్వహిస్తోంది. అన్నీ కలిసొస్తే, ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో మూడు సోషల్ మీడియా దిగ్గజాలనూ కలిపే సేవలు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.