సముద్రంలో కొట్టుకుపోతున్న యువతి ప్రాణాలు కాపాడిన లైఫ్ గార్డులు!

  • విశాఖ ఆర్కే బీచ్ లో ఘటన
  • స్నానానికి వచ్చిన గొల్లపూడి జ్యోతి
  • అలల ఉద్ధృతికి కొట్టుకుపోతుంటే కాపాడిన గార్డులు
సముద్రపు అలలు ఆమె పాలిట మృత్యు కెరటాలు కాబోగా, దీన్ని గమనించిన లైఫ్ గార్డులు కాపాడారు. ఈ ఘటన విశాఖ ఆర్కే బీచ్ వద్ద జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణానికి చెందిన గొల్లపూడి జ్యోతి (20) బీచ్ కి వచ్చి స్నానం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన బలమైన కెరటం, ఆమెను లోపలికి లాగేసింది. అలల ఉద్ధృతికి ఆమె మరింత లోతుగా వెళ్లిపోతున్న వేళ, అక్కడే ఉన్న లైఫ్‌ గార్డులు ఎం కృష్ణ, వీ పైడిరాజు, కే రాజు గమనించారు. ఒక్క ఉదుటన సముద్రంలోకి వెళ్లి, ఆమెను రక్షించి ఒడ్డుకి చేర్చారు. జ్యోతికి ప్రాణాపాయం తప్పడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేయగా, తన ప్రాణాలు కాపాడినందుకు ఆమె, లైఫ్‌ గార్డులకు కృతజ్ఞతలు చెప్పింది.
Go Back to Shorts
Vizag
Beach
Life Guards

More Telugu News