ప్రకాశం జిల్లాలో పల్టీలు కొట్టిన బొలేరో వాహనం.. ఒకరి దుర్మరణం, 8 మందికి తీవ్ర గాయాలు
- పామూరు మండలం కుంటకాడ అయ్యవారి పల్లెలో ఘటన
- వేగంగా వెళుతూ అదుపుతప్పిన బొలేరో కారు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వలేటివారి పాలెం మండలం కుమ్మరం పాలెంకు చెందిన కార్మికులు ఈరోజు పామూరులో పనికి బయలుదేరారని తెలిపారు. అయితే కుంటకాడ అయ్యవారి పల్లె వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టిందన్నారు. ఈ ఘటనలో వలేటివారి పాలెంకు చెందిన నర్సింహారావు దుర్మరణం చెందాడన్నారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయనీ, వారికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.