అఖిల్ అదరగొట్టేశాడు .. 'మిస్టర్ మజ్ను' ప్రీమియర్ షో టాక్

  • దర్శకుడు కథనాన్ని బాగా నడిపించాడు
  •  అఖిల్ మంచి మార్కులు కొట్టేశాడు
  •  గ్లామర్ తో పడగొట్టేసిన నిధి అగర్వాల్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందిన 'మిస్టర్ మజ్ను'ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి చాలా క్యూట్ గా ఈ ప్రేమకథను తెరపై ఆవిష్కరించాడని అంటున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఆడియన్స్ ను కదలనీయకుండా చేశాడని చెబుతున్నారు. ఎంటర్టైన్ మెంట్ .. ఎమోషన్ పాళ్లు ఏ మాత్రం అటు ఇటు కాకుండా వెంకీ అట్లూరి తీసుకున్న జాగ్రత్తకి మంచి మార్కులు ఇస్తున్నారు.

అఖిల్ ను మరింత హ్యాండ్సమ్ గా చూపించాడనీ, రొమాంటిక్ లుక్ తో అఖిల్ అదరగొట్టేశాడని అంటున్నారు. కొత్త బాడీ లాంగ్వేజ్ తో అఖిల్ తన నటనలోనూ కొత్తదనాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. నిధి అగర్వాల్ గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమన్ సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో అఖిల్ కి తొలి హిట్ పడే అవకాశాలు వున్నాయనే అంటున్నారు.
Go Back to Shorts
akhil
nidhi agarwal

More Telugu News