హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లకు ఊరట!
- మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా, రాహుల్
- నిషేధం విధించిన పాలకమండలి
- తాజాగా నిషేధం ఎత్తివేత
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో మహిళల పట్ల వీరిద్దరూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, వీరిద్దరిపై వేటు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిని అర్థాంతరంగా బీసీసీఐ వెనక్కి పిలిపించింది. న్యూజిలాండ్ టూర్ కు కూడా వీరిని ఎంపిక చేయలేదు.