సైనికుడిగా మారి భరతమాత కోసం ప్రాణాలర్పించిన మాజీ టెర్రరిస్టు... ప్రతిష్ఠాత్మక 'అశోక చక్ర'ను ప్రకటించిన కేంద్రం!
- 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా నాజిర్ అహ్మద్ వనీ
- ఆపై లొంగిపోయి ఉగ్రవాద నిర్మూలనకు కృషి
- కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి
కాగా, 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా ఉన్న నాజిర్ అహ్మద్ వనీ, ఆపై లొంగిపోయి, కౌంటర్- ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో భాగమయ్యాడు. అతని నిబద్ధతను చూసిన ఉన్నతాధికారులు, ఆర్మీ 162వ బెటాలియన్ లో స్థానం కల్పించారు. కుల్గాంకు చెందిన వనీ, సైనికుడిగా రెండు సార్లు సేనా మెడల్ పురస్కారాన్ని అందుకోవడం గమనార్హం. ఆయనకు భార్య, 20, 18 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు.