Pakistan: ఏయ్ నల్లోడా.. ఈ రోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది?: పాక్ కెప్టెన్ జాతి వివక్ష వ్యాఖ్యలు

  • పాక్-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే
  • ఫెహ్లుక్వాయోపై అనుచిత వ్యాఖ్యలు
  • స్టంప్‌లో రికార్డు

క్రీజులో పాతుకుపోయిన ఆటగాడిని అవుట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో స్లెడ్జింగే మార్గమనుకున్న పాక్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండిలే ఫెహ్లుక్వాయోపై మితిమీరిన వ్యాఖ్యలు చేశాడు. ‘నల్లోడా’ అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు.

మంగళవారం డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ మైదానంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఫెహ్లుక్వాయో ఘోరంగా దెబ్బకొట్టాడు. 9.5 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పాక్ 203 పరుగులకే ఆలౌట్ అయింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 42 ఓవర్లలోనే విజయాన్ని అందుకున్నారు. బౌలింగ్‌లో సత్తా చాటిన ఫెహ్లుక్వాయో బ్యాటింగ్‌లోనూ రాణించి అజేయంగా 69 పరుగులు చేశాడు. ఫెహ్లుక్వాయో క్రీజులో పాతుకుపోయి పరుగులు తీస్తుండడంతో ఎలా అవుట్ చేయాలో తెలియని పాక్ కెప్టెన్-వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉర్దూలో దారుణంగా స్లెడ్జింగ్‌కు దిగాడు. ‘ఏయ్ నల్లోడా.. ఈ రోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీ గురించి ఆమెను ఏమని ప్రార్థించమన్నావ్?’’ అని జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టాడు. అతడి వ్యాఖ్యలు స్టంప్‌లోని మైక్రోఫోన్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. సర్ఫరాజ్ దోషిగా తేలితే ఓ టెస్టు నుంచి నిషేధానికి గురవుతాడు.

More Telugu News