పంచాయతీ ఎన్నికల బరిలో తోడికోడళ్లు...ఎవరు గెలిచినా పదవి ఆ కుటుంబానిదే!
- ఆసిఫాబాద్ జిల్లా చోర్‌పల్లి పంచాయతీలో ప్రత్యేకం
- ఎస్టీలకు కేటాయించిన నూతన పంచాయతీ
- ఒకరు టీఆర్‌ఎస్, మరొకరు కాంగ్రెస్ మద్దతుదారులు
గతంలో రహపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న నందుప గ్రామం పునర్విభజనలో భాగంగా చోర్‌పల్లిలోకి చేరింది. పంచాయతీలో ఒకే ఒక ఎస్టీ కుటుంబం ఉండడంతో ఆ కుటుంబానికి చెందిన వారే ప్రత్యర్థులుగా బరిలో ఉంటున్నారు. గతంలో కూడా నందుపా గ్రామానికి చెందిన కమ్మరి భీమయ్య కుటుంబ సభ్యులు కమ్మరి మొండయ్య, కమ్మరి చిన్నన్న, కమ్మరి బాయక్క, కమ్మరి పోచయ్యలు సర్పంచ్‌లుగా పనిచేశారు. పంచాయతీలో 952 మంది ఓటర్లు ఉండగా, 478 మంది పురుషులు, 474 మంది మహిళలు ఉన్నారు.