ప్రారంభమైన కేసీఆర్ 'సహస్ర మహా చండీయాగం'
- ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సహస్ర మహా చండీయాగం
- హాజరైన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- 300 మందికి పైగా రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటున్నారు
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని రుత్విక్కులు పూజలు చేశారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 300 మందికి పైగా రుత్విక్కులు ఈ యాగాల్లో పాల్గొంటున్నారు.