పల్టీ కొట్టిన కారు.. మహిళా సీఐకు తీవ్ర గాయాలు
- సంగారెడ్డి జిల్లాలో విజిలెన్స్ సీఐగా పని చేస్తున్న నిర్మల
- నాగారం నుంచి తిరుమలగిరి వెళ్తుండగా ప్రమాదం
- కారులోని ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలు
వివరాల్లోకి వెళ్తే, సీఐ నిర్మల తన తల్లి స్వస్థలమైన నాగారానికి వచ్చి... తన సొంత పనిపై తిరుమలగిరివైపు కారులో వెళ్తున్నారు. కారులో ఆమె కుమార్తె జాజి, అల్లుడు చింటు, చెల్లి కొడుకు సుహాన్ లు ఉన్నారు. ఈ క్రమంలో కారు నాగారం బంగ్లా శివారులోని రైస్ మిల్లు వద్దకు వచ్చిన తర్వాత అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో నిర్మలకు తీవ్ర గాయాలు కాగా... ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. ఘటనా స్థలిని నాగారం సీఐ రవీందర్, ఎస్ఐ లింగంలు పరిశీలించారు.