ఎర్రవల్లిలో నేడు మహారుద్ర సహిత సహస్ర చండీయాగం.. ఫాంహౌస్ కు చేరుకున్న కేసీఆర్!
- ఐదు రోజుల పాటు సాగనున్న యాగం
- 250 మంది రుత్విక్కుల సమక్షంలో పూజలు
- టీఆర్ఎస్ నేతలను ఆహ్వానించిన మంత్రి
శృంగేరీ పీఠం సంప్రదాయ పద్ధతిలో, ఆ పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మ, తెలంగాణ పత్రిక సంపాదకుడు అష్టకాల రామ్మోహనశర్మ పర్యవేక్షణలో ఐదు రోజులపాటు ఈ క్రతువు సాగనుంది. ఈరోజు ఉదయం 9.30 గంటలకు గణపతి పూజతో యాగం ప్రారంభం కానుంది. ఈ యాగానికి టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను అధినేత కేసీఆర్ ఆహ్వానించారు.
తెలంగాణ సీఎం ఇంతకుముందు రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగ నిర్వహణ కోసం 3 యాగ శాలలు, 16 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన 200 మంది, తెలంగాణ నుంచి వచ్చిన 50 మంది రుత్విక్కులు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు.