సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పెద్ద తేడా లేదంటున్న రకుల్ 
  • రజనీ చిత్రానికి నామినేషన్లు 
  • ఒకేసారి రెండు చిత్రాల్లో నితిన్
*  టాలీవుడ్ కి, బాలీవుడ్ కి పెద్ద తేడా ఏమీ లేదు.. అంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'హీరోయిన్లను ట్రీట్ చేసే పద్ధతిలో మొదట్లో తేడా ఉంటుందని అనుకునే దానిని. అయితే, ప్రత్యక్షంగా చూశాక ఏ విషయంలోనూ తేడా కనిపించలేదు. కథానాయికకు అన్ని చోట్లా ఒకే గౌరవం లభిస్తోంది' అని చెప్పింది రకుల్.
*  రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన రోబో సీక్వెల్ '2.O' మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని అమెరికాలో జరిగే 66వ ఎంపీఎస్ఈ గోల్డెన్ రీల్ అవార్డ్స్ కి నామినేట్ చేశారు. పలు విభాగాల్లో ఈ చిత్రం నామినేషన్లు పొందింది.
*  యంగ్ హీరో నితిన్ ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తను నటించే 'భీష్మ' చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుండగా, సూర్య ప్రతాప్ దర్శకత్వంలో మరో చిత్రం మార్చి నెలలో మొదలవుతుంది. 
Rakul
Rajanikanth
Shankar
Nithin

More Telugu News