తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క నియామకం
- సీఎల్పీ నేత ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెర
- మల్లు భట్టి విక్రమార్కను నియమించిన అధిష్ఠానం
- ఈ మేరకు ఓ ప్రకటన విడుదల
కాగా, నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను రాహుల్ కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా, సీఎల్పీ రేసులో సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నప్పటికీ ఈ పదవి దళిత వర్గానికి చెందిన భట్టికే దక్కింది. 2009లో, 2014లో భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో మధిర నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు.