ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా
- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్యా
- వేటు వేసిన బీసీసీఐ
- ఇంటికే పరిమితమైన పాండ్యా
హార్ధిక్ కు పతంగులు ఎగురవేయడమంటే చాలా ఇష్టమని... కొన్నేళ్లుగా క్రికెట్ కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాడని.. దాంతో పతంగులు ఎగురవేసే అవకాశం రాలేదని హిమాన్షు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా పతంగులు ఎగురవేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. టీవీలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాడని... బీసీసీఐ సస్పెండ్ చేయడంతో బాధపడుతున్నాడని చెప్పారు. మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని చెప్పాడని తెలిపారు. బీసీసీఐ తీసుకోబోయే తదుపరి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.