జగన్ కచ్చితంగా బీజేపీతో కలిసి నడుస్తారు: జేసీ దివాకర్ రెడ్డి

  • కైకలూరులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నజేసీ 
  • కేంద్రం మాట తప్పిన విషయమై స్పందించట్లేదు
  • చంద్రబాబు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఏ పార్టీతో పొత్తుకుంటారనే విషయాన్ని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. నేడు ఆయన కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు నివాసంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ కచ్చితంగా బీజేపీతో కలిసి నడుస్తారని జోస్యం చెప్పారు.

ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం మాట తప్పిన విషయమై జగన్ మినహా రాష్ట్రమంతా స్పందిస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు మరో ఐదేళ్లు సీఎంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని దివాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
BJP
JC Diwakar Reddy
Andhra Pradesh
Special Status

More Telugu News