Andhra Pradesh: తెలుగు ప్రజల ఇళ్లు భోగభాగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా!: జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ తెలుగు ప్రజలకు ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ఇళ్లు భోగభాగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఉదయం ట్విట్టర్ లో జగన్ స్పందిస్తూ..‘తెలుగువారందరి ఇంటా భోగభాగ్యాలూ, సిరిసంపదలూ, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలనీ, ఎంతో గొప్పవైన మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ... అందరికీ సంక్రాంతి శుభాక్షాంక్షలు. Happy #Sankranthi2019’ అని జగన్ ట్వీట్ చేశారు.