మోదీ ప్రభుత్వం నుంచి మరో బంపర్ బొనాంజా.. ఆదాయపు పన్ను పరిమితి పెంపు?
- ప్రస్తుతం రూ. 2.50 లక్షలు దాటితే పన్ను
- పరిమితిని 5 లక్షలకు పెంచే యోచన
- ఎన్నికలకు ముందు భారీ తాయిలం
త్వరలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం, ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.