జగన్ పై దాడి కేసు.. నిందితుడు శ్రీనివాసరావును విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలించిన ఎన్ఐఏ!
- హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు నిర్ణయం
- విశాఖ అనువైన ప్రాంతం కాదని భావించిన అధికారులు
- శ్రీనివాసరావు తరలింపుకు ఉన్నతాధికారుల ఓకే
అంతకముందు ఇక్కడ శ్రీనివాసరావును విచారించడం కుదరదని భావించిన అధికారులు మరో చోటుకు తరలించేందుకు అనుమతిని కోరారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు జగన్ పై కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతుగా గాయం కావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో జగన్ చికిత్స చేయించుకున్నారు. అనంతరం జగన్ అప్పటి ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసును న్యాయస్థానం ఎన్ఐఏకు అప్పగించింది.