ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులు కావాలి: పార్టీ నేతలతో పవన్ కల్యాణ్
- ఏపీ రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయి
- జనసేన మద్దతుతో 2014లో టీడీపీ, బీజేపీ గెలిచాయి
- ప్రజాసేవ చేయాలన్న సదుద్దేశంతోనే ప్రజారాజ్యంను చిరంజీవి స్థాపించారు
ఏపీలోని రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి సీఎం చేయండని టీడీపీ కోరుతుంటే, ఒక్క అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరుతోందని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని... కానీ, పక్కనున్న వారే నిరాశకు గురిచేశారని అన్నారు.