కాజల్ కన్నా తక్కువ పారితోషికమే తీసుకుంటోన్న అనుష్క
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాజల్ కన్నా తక్కువ పారితోషికమే తీసుకుంటోన్న అనుష్క

  • నయనతారకి ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్లు
  • కాజల్ అందుకునే పారితోషికం 2 కోట్లు
  • అనుష్క తీసుకునేది 1.25 కోట్లు  
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్క అగ్రకథానాయికగా కొనసాగుతోంది. అయితే కొంతకాలంగా అనుష్క చాలా తక్కువగా సినిమాలు చేస్తూ వెళుతోంది. ఇక నయనతార విషయానికి వస్తే, తమిళంలో ఆమె లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది. తెలుగులోను నయనతారకి మంచి క్రేజ్ వుంది. సీనియర్ స్టార్ హీరోయిన్స్ గా ఈ ఇద్దరూ పక్కపక్కనే కనిపిస్తూ వుంటారు. నయనతార ఒక సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటుంది. ఆ తరువాత స్థానం అనుష్కదేనని అంతా అనుకున్నారు. కానీ అనుష్క చాలా తక్కువ పారితోషికమే తీసుకుంటోందనే టాక్ బయటికి వచ్చింది. తాజాగా హేమంత్ మధుకర్ తో చేయనున్న సినిమాకిగాను ఆమె 1.25 కోట్లను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాజల్ ఒక సినిమాకి 2 కోట్లు తీసుకుంటూ ఉండగా, అంతకంటే అనుష్క తక్కువ తీసుకోవడం ఆశ్చర్యకరం. మొదటి నుంచి కూడా అనుష్క కథాకథనాలకే ప్రాధాన్యత ఇస్తుందనీ, పారితోషికాన్ని ఆమె ఎప్పుడూ డిమాండ్ చేయదని సన్నిహితులు చెబుతున్నారు.
Anushka Shetty

More Telugu News