Jagan: పాదయాత్రలో తుది అంకం... వెల్లువెత్తిన జనసంద్రం!

  • ప్రారంభమైన తుది రోజు యాత్ర
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
  • మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి కానున్న యాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర తుది రోజు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ఉదయం 9 గంటల తరువాత ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియాలో ఏర్పాటైన శిబిరం నుంచి బయటకు వచ్చిన జగన్, తనను కలిసేందుకు వేచిచూస్తున్న కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ, ముందుకు సాగారు. అంతకుముందు వేదపండితుల ఆశీస్సులను ఆయన తీసుకున్నారు.

జగన్ పాదయాత్ర చివరి అడుగుల్లో తమ అడుగులను కలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. దారిపొడవునా ఆయనకు ఘన స్వాతం పలుకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల్లోపు ఆయన తన పాదయాత్రను ముగించుకోనున్నారు. ఆపై ఆయన బహిరంగ సభలో పాల్గొని, అటునుంచి విశాఖపట్నం మీదుగా తిరుపతికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం ఆయన తిరుమలకు కాలినడకన వెళ్లి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 

More Telugu News