ఏపీలో అసైన్డ్, చుక్కల భూముల సమస్య పరిష్కరించాలి.. కార్యాచరణ ప్రకటించాలి: సినీ హీరో శివాజీ
- కార్యాచరణ ప్రకటిస్తే 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం
- అధికారుల జాప్యంతో ఈ సమస్య మరింత జటిలం
- రైతులు నలిగిపోతున్నారు
అసైన్డ్, చుక్కల భూములకు సంబంధించి రైతుల వద్ద ఎటువంటి ఆధారం ఉన్నా ఆ భూమి రైతులకే చెందుతుందని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. రెవెన్యూ అధికారుల జాప్యం కారణంగా ఈ సమస్య మరింత జటిలమైందని, తమ భూములను రైతులు కొనేందుకు, విక్రయించేందుకు వీల్లేక పోవడంతో రైతులు నలిగిపోతున్నారని అన్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబుని శివాజీ ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన చర్చించారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని శివాజీకి బాబు హామీ ఇచ్చారు.