YSRCP: సీఎం కుర్చీ తప్ప మరేమీ కనిపించదా?: దేవినేని ఉమ

షార్ట్స్‌లో చూడండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీ తప్ప, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, మంచిని అంగీకరించలేని మానసిక‌ వ్యాధి జగన్ ను పీడిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పోలవరంలో రికార్డు స్థాయిలో పనులు జరుగుతుంటే, జగన్ ఓర్వలేకపోతున్నాడని, ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌ డైరెక్షన్‌ లో సీఎం చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ. 10 వేల కోట్లు ఖర్చుపెడితే, రూ. 25 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు.
Go Back to Shorts
YSRCP
Devineni Uma
Jagan
CM

More Telugu News