అమ్మకానికి పాములు...సామాజిక మాధ్యమాల ద్వారా యువకుల బేరసారాలు
- మెడలో కొండచిలువతో ఫొటో దిగి ప్రకటన
- ఇంటిపై దాడిచేసి స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు
- వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు
దీంతో సోమవారం నిందితుల ఇంటిపై దాడిచేసి రెండు పాములను స్వాధీనం చేసుకోవడంతోపాటు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని రంగారెడ్డి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కొండచిలువ అమ్మకానికి ప్రయత్నించిన వారికి మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.