ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ!
- ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించడంపై హర్షం
- ప్రజలకు మరింత చేరువవుతామని వ్యాఖ్య
- ఆరోగ్యకరమైన చర్చ కోరుకుంటున్నట్లు వెల్లడి
ఈరోజు ఉదయం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ.. ‘ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించడం, మీ అందరితోనూ అభిప్రాయాలను పంచుకునే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ప్రజలకు మరింత చేరువయ్యే విషయంలో.. ఈ వేదికపై జరిగే ఆరోగ్యకరమైన చర్చ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరి ఆదరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.