రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీకి మొండిచెయ్యి.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు!
- పోలవరం కాంక్రీట్ పనుల్లో సరికొత్త రికార్డు
- కార్మికులు, అధికారులకు సీఎం అభినందనలు
- ఏపీ అభివృద్ధిని చూసి మోదీకి అక్కసు కలుగుతోంది
ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యల్లో నైరాశ్యం కనిపిస్తోందన్నారు. అమరావతిలో ఈరోజు కలెక్టర్లు, అధికారులతో ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీకి శకటం లేకుండా చేయడం వివక్షేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.