హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ఈ 8న నీటి సరఫరాకు అంతరాయం
- ఆ రోజు ఉదయం 6 నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు
- పంపింగ్ స్టేషన్లకు మరమ్మతులే కారణం
- ప్రాంతాల వివరాలు వెల్లడించిన వాటర్ బోర్డు
దీంతో గంధంగూడ, బోజగుట్ట, ఆసిఫ్ నగర్, హబ్సీగూడ, నాచారం, తార్నాక, లాలపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, మీర్‌పేట్, షేక్‌పేట, మాదాపూర్, గచ్చిబౌలి, మూసారాంబాగ్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్‌మెట్, శివం, చిలకలగూడ, అలియాబాద్, మీరాలం, కిషన్‌బాగ్‌లకు నీటి సరఫరా ఉండదు.
అలాగే, సాహెబ్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, బాలాపూర్, బార్కాస్, మైసారం, బండ్లగూడ, రియాసత్‌నగర్, సంతోష్ నగర్, వినాయకనగర్, సైదాబాద్, ఆస్మాన్‌ఘడ్, చంచలగూడ, యాకత్‌పురా, మలక్‌పేట, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రిపురం, బుద్వేల్, గోల్డెన్‌హైట్స్, సులేమానగర్, హైదర్‌గూడ, అల్లబండ, ప్రశాసన్‌నగర్, మౌలాలి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్, బోడుప్పల్, బీరప్పగూడ ప్రాంతాలకు కూడా నీటి సరఫరా నిలిచిపోనుందని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు.