ఎన్టీఆర్ కి లైన్ చెప్పిన 'అర్జున్ రెడ్డి' దర్శకుడు
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ కి లైన్ చెప్పిన 'అర్జున్ రెడ్డి' దర్శకుడు

  • హిందీలోకి రీమేక్ అవుతోన్న 'అర్జున్ రెడ్డి' 
  • ఆల్రెడీ మహేశ్ కి కథ వినిపించిన సందీప్ వంగా 
  • మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ  
తెలుగులో ఈ మధ్య కాలంలో సంచలన విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో 'అర్జున్ రెడ్డి' ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సందీప్ వంగా, ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇంతకుముందే ఆయన మహేశ్ బాబుకి ఒక కథ వినిపించాడనీ, తన కమిట్మెంట్స్ పూర్తయిన తరువాత చూద్దామని మహేశ్ బాబు అన్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సందీప్ వంగా ఎన్టీఆర్ కి ఒక లైన్ వినిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ను కలుసుకున్న సందీప్ వంగా ఆయనకి ఒక లైన్ చెప్పాడట. లైన్ బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని ఎన్టీఆర్ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇది మాస్ యాక్షన్ తో కూడుకున్న లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ గనుకనే సందీప్ వంగా ఆ తరహా కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ కథతో ఆయన ఎన్టీఆర్ ను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి.
sandeep vanga
ntr

More Telugu News