ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు సవాల్!
- మీ వల్ల దేశానికి ఏం లాభం జరిగింది?
- కేంద్రం సాధించిన వృద్ధి రేటు ఏముంది?
- రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ఆయన ధ్యేయం
తన చర్యల కారణంగా దేశ ప్రజలను మోదీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. బలహీనుల్ని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ఆయన ధ్యేయమని, సుస్థిర ప్రభుత్వం రాకూడదని, సామంత రాజులు రావాలని చూస్తున్నారని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సుస్థిరత రాకుండా చేస్తున్నారని, తమ దృష్టి మరల్చి, తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ మోదీని దుయ్యబట్టారు.