Vijayawada: రేపటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి డ్రెస్ కోడ్

  • మహిళలు, పురుషులకు సంప్రదాయ దుస్తులు  
  • డ్రెస్ కోడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి
  • ఆలయ ఈవో కోటేశ్వరమ్మ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోవాలంటే ఇకపై డ్రెస్ కోడ్ లో వెళ్లాల్సిందే. రేపటి నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే మహిళలు, పురుషులు కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ, మహిళలు చీరలు, లంగావోణీలు, పంజాబీ డ్రెస్సులు ఇతర సంప్రదాయ దుస్తులలోను; పురుషులైతే పంచె, లాల్చీ, ప్యాంటూ చొక్కా ధరించి రావాలని పేర్కొన్నారు. డ్రెస్ కోడ్ విషయంలో నిబంధనలు తప్పకుండా పాటించాలని భక్తులను కోరారు.

More Telugu News