sankalp reddy: గుర్తింపు కోసం పాకులాడను: దర్శకుడు సంకల్ప్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
'ఘాజీ' .. 'అంతరిక్షం' సినిమాలు దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి ప్రతిభకు అద్దం పడతాయి. అయితే ఆయన ప్రతిభకు రావలసిన గుర్తింపు రాలేదనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. ఇదే విషయాన్ని గురించిన ప్రస్తావన తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రాగా, తనదైన శైలిలో ఆయన స్పందించాడు.

"మొదటి నుంచి కూడా నేను గుర్తింపు కోసం పాకులాడలేదు. మీ ఇంటర్వ్యూకి రావడానికి కూడా నేను పదిసార్లు ఆలోచించాను. గుర్తింపు గురించి పెద్దగా ఆలోచించను .. అందువల్లనే ఎక్కడా పెద్దగా కనిపించను. సినిమా ప్రమోషన్స్ కి కూడా నేను వెళ్లను. నేను ఎలాగో పెద్దగా మాట్లాడను గనుక, ఆర్టిస్టులతోనే ప్రమోషన్స్ చేయించమని చెబుతుంటాను. దర్శకులను చూసి సినిమాకి వచ్చేవాళ్లు చాలా తక్కువ గనుక, ఆర్టిస్టులతోనే ప్రమోషన్స్ చేయించడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం" అని అన్నాడు. 
Go Back to Shorts
sankalp reddy

More Telugu News