సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తెలుగులో రకుల్ కి మరో ఛాన్స్
- మరో సినిమాలో 'టాక్సీవాలా' నాయిక
- 'కేజీఎఫ్' ఖాతాలో ఇంకో రికార్డు
* యంగ్ హీరో బెల్లంకొండ సురేశ్ తమ్ముడు గణేశ్ కూడా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. నూతన దర్శకుడు ఫణి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో 'టాక్సీవాలా' ఫేం ప్రియాంకా జువాల్కర్ హీరోయిన్ గా ఎంపికైంది.
* యశ్ హీరోగా ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్' చిత్రం కన్నడ నాట బిగ్గెస్ట్ హిట్ గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఒక్క కన్నడలోనే 40 కోట్ల షేర్ వసూలు చేసి గత రికార్డులను తిరగరాసింది.