మంచులో చిక్కుకుపోయిన 400 వాహనాలు.. 3 వేల మందిని రక్షించిన సైన్యం
- సిక్కింలో భారీగా కురుస్తున్న మంచు
- నాథులా పాస్ నుంచి తిరిగి వస్తూ మంచులో చిక్కుకుపోయిన పర్యాటకులు
- సురక్షిత ప్రాంతాలకు తరలించిన సైన్యం
1500 మంది పర్యాటకులను 17వ మైలు ఆర్మీ క్యాంపులో ఉంచామని, మిగిలిన వారిని 13వ మైలు క్యాంపులో ఉంచామని ఆర్మీ అధికారులు తెలిపారు. పర్యాటకులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రహదారులపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు భారీ డోజర్లు, యంత్రాలను సైన్యం ఉపయోగిస్తోంది.