modi: మోదీ బయోపిక్ కు రంగం సిద్ధం.. మోదీ పాత్రధారి ఎవరంటే..?

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్, టాలీవుడ్ లలో ప్రస్తుతం బయోపిక్ ల జోరు నడుస్తోంది. బయోపిక్ లకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉండటంతో... దర్శకనిర్మాతలు వాటిపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా, ప్రధాని మోదీ జీవిత చరిత్రతో సినిమాను నిర్మించేందుకు బాలీవుడ్ లో రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్ కు సంబంధించి... స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అంశాలపై ఒమంగ్ టీమ్ భారీ వర్క్ చేస్తోందట. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఈ చిత్రంలో మోదీ పాత్రను పోషించేందుకు ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించినట్టు సమాచారం. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రను పోషిస్తే... దక్షిణాదిన కూడా మంచి ఆదరణ లభిస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. దక్షిణాదిన ఇప్పటికే పలు చిత్రాల్లో వివేక్ ఒబెరాయ్ నటించిన సంగతి తెలిసిందే.
నరేంద్ర మోదీతో వివేక్ ఒబెరాయ్నరేంద్ర మోదీతో వివేక్ ఒబెరాయ్
Go Back to Shorts
modi
biopic
bollywood
vivek oberoi
omang kumar

More Telugu News