పుల్వామాలో నలుగురు టెర్రరిస్టులను కాల్చి చంపిన సైన్యం
- పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కార్డన్ సెర్చ్
- భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించిన టెర్రరిస్టులు
- సాంబ సెక్టార్ లో రెండు ఏకే 47 తుపాకులు స్వాధీనం
ఈ నేపథ్యంలో, తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్పటికే పూర్తి అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. మరోవైపు, జమ్ములోని సాంబ సెక్టార్ లో నిన్న అర్ధరాత్రి సైన్యం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భూమిలో పాతిపెట్టిన రెండు ఏకీ 47 తుపాకులు, భారీ ఎత్తున బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.