కేటీఆర్ జీ.. కుంభమేళాకు రండి.. స్వయంగా ఆహ్వానించిన యూపీ ప్రభుత్వం!
- ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో కుంభమేళా
- కేటీఆర్ ను కలుసుకున్న యూపీ మంత్రి సతీశ్
- సానుకూలంగా స్పందించిన టీఆర్ఎస్ నేత
ఈరోజు కేటీఆర్ ను కలుసుకున్న యూపీ మౌలికవసతులు, పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా కుంభమేళాకు రావాల్సిందిగా స్వయంగా వచ్చి ఆహ్వానించారు. కాగా, ఈ విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
