ajith: భారీ రేటుకు 'విశ్వాసం' హిందీ డబ్బింగ్ రైట్స్

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో అజిత్ కి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. దాంతో శివ దర్శకత్వంలో ఆయన చేసిన 'విశ్వాసం' సినిమాకి అంచనాలు పెరిగిపోతున్నాయి. గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సాధించాయి .. కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇక వరుస విజయాలతో ఒక రేంజ్ కి వెళ్లిన నయనతార ఇందులో కథానాయిక కావడం ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరగడానికి కారణమైంది.

ఇలా ఈ సినిమాపై ఆడియన్స్ లో గల క్రేజ్ కారణంగా హిందీ డబ్బింగ్ (టీవీ) రైట్స్ భారీ రేటు పలికాయి. ఈ హక్కులు 13 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అజిత్ కెరియర్లో ఆయన సినిమాకి ఈ స్థాయి రేటు పలకడం ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్నారు. తెలుగులో గట్టిపోటీ ఉండటం వలన, కాస్త సమయం తీసుకుని తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Go Back to Shorts
ajith
nayan

More Telugu News