విదేశాల్లోను 'విశ్వాసం' విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విదేశాల్లోను 'విశ్వాసం' విడుదల

  • క్రేజీ కాంబినేషన్లో 'విశ్వాసం'
  • రష్యా .. ఉక్రెయిన్లలోను విడుదల
  • భారీ ఓపెనింగ్స్ ఖాయమంటోన్న ఫ్యాన్స్       
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో 'విశ్వాసం' నిర్మితమైంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళనాడులోనే కాకుండా రష్యా .. ఉక్రెయిన్ లలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అజిత్ కెరియర్లో ఆయన సినిమా రష్యా .. ఉక్రెయిన్ లలోను విడుదల కావడం ఇదే మొదటి సారి. రష్యాలో 8కి పైగా సిటీల్లో విడుదల కానున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం.

గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. అందువలన ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న 'విశ్వాసం'పై అంచనాలు బాగానే వున్నాయి. అటు అజిత్ కి గల క్రేజ్ .. ఇటు నయనతారకి గల ఇమేజ్ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టడం ఖాయమనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాతో అజిత్ కి మరో సూపర్ హిట్ పడుతుందనే నమ్మకంతో అజిత్ అభిమానులు వున్నారు. 
ajith
nayanatara

More Telugu News