మోదీ సభకు వెళుతూ పల్టీలు కొట్టిన బస్సు.. 35 మంది విద్యార్థులకు గాయాలు!
- హిమాచల్ ప్రదేశ్ లో ఘటన
- ధర్మశాలకు వెళుతున్న బస్సు
- కేసు నమోదుచేసిన పోలీసులు
ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జు అయిందన్నారు. వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పడం కారణంగానే పల్టీలు కొట్టిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.