సీఎం చంద్రబాబు శరీరంలో ఉండేది 70 శాతం కాంగ్రెస్ రక్తమే!: నటుడు పృథ్వీ తీవ్ర వ్యాఖ్యలు
- ప్రత్యేకహోదాను ఆడపిల్ల అన్నారు
- నల్లారి గోల్ఫ్ ఆడుకుంటున్నారు
- వంచనపై గర్జన దీక్షలో విమర్శలు
సంక్రాంతి పండుగకు హరిదాసు వచ్చినట్లు ఏపీలో కొందరు నేతలు సరిగ్గా ఎన్నికల ముందు ప్రజల వద్దకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం నుంచి కూకట్ పల్లి వరకూ తెలంగాణ ప్రజలు మహాకూటమిని చాచిపెట్టి కొట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి నాయకుడిని తాను ఇంతవరకూ చూడలేదన్నారు. తెలుగువాడిగా పుట్టినందుకు చంద్రబాబు సిగ్గుపడాలని విమర్శించారు. తన శరీరంలో 70 శాతం కాంగ్రెస్ రక్తమే ఉందని చంద్రబాబు ఓసారి చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో రాజన్న సంక్షేమ రాజ్యం వస్తుందని పృథ్వీ జోస్యం చెప్పారు.