నేను కూడా మోసపోయినవాడినే: 'బ్లఫ్ మాస్టర్' నటుడు సత్యదేవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను కూడా మోసపోయినవాడినే: 'బ్లఫ్ మాస్టర్' నటుడు సత్యదేవ్

  • 'బ్లఫ్ మాస్టర్' గా సత్యదేవ్ 
  • కథానాయికగా నందిత శ్వేత
  • రేపే ప్రేక్షకుల ముందుకు  
సత్యదేవ్ ప్రధాన పాత్రధారిగా 'బ్లఫ్ మాస్టర్' సినిమా నిర్మితమైంది. నందిత శ్వేత కథానాయికగా రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ .."నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో చైన్ మార్కెటింగ్ లో చేరాను.

అత్యాశ కారణంగా నేను మోసపోయాను. సాధారణంగా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మోసపోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కువగా మోసపోయేది మధ్యతరగతివారే అనే విషయం నాకు అర్థమైంది. అలా జీవితంలో నిత్యం జరిగే మోసాల ఆధారంగా 'బ్లఫ్ మాస్టర్' నిర్మితమైంది. డబ్బుకన్నా ముఖ్యమైనది ప్రేమ అని చాటి చెప్పే ఈ సినిమాలో, బ్లఫ్ మాస్టర్ గెటప్స్ .. ఆయన మోసం చేసే తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు. 
sathyadev
nandita sweta

More Telugu News