నిజంగా అద్భుతమే... కేదార్ నాథ్ వరదల్లో తప్పిపోయి... ఐదేళ్ల తరువాత కుటుంబం చెంతకు చేరిన యువతి!
- 2013లో తల్లిదండ్రులతో కలసి కేదార్ నాథ్ కు
- వరదల్లో తప్పిపోయిన చంచల
- ఎన్జీవో సంస్థ కృషితో తిరిగి ఇంటికి
తప్పిపోయిన చంచల్ ను కొందరు చేరదీసి, జమ్మూ కాశ్మీర్ లోని ఓ అనాధాశ్రమంలో చేర్చారు. అక్కడ ఆమె వచ్చీరాని మాటలతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండటంతో, ఆమె వివరాలు కనుక్కునేందుకు చాలా కాలమే పట్టింది. ఆమె అలీగడ్ గురించి, అక్కడున్న తనవారి గురించి కాస్తంత సమాచారం ఇవ్వడంతో, విషయాన్ని చైల్డ్ లైన్ సంస్థకు చేరవేశారు.
ఓ ఎన్జీవో సంస్థకు చెందిన జ్ఞానేంద్ర మిశ్రా ఎంతో శ్రమించి, పోలీసుల సాయంతో చంచల కుటుంబాన్ని కనిపెట్టారు. తమ మనవరాలు తిరిగి ఇల్లు చేరుకోవడం ఓ అద్భుతమని చంచల తాతయ్య హరీష్ చంద్, నానమ్మ శకుంతలాదేవి వ్యాఖ్యానించారు.