మూఢనమ్మకపు కొడుకు.. తల్లి మృతదేహంతో పద్దెనిమిది రోజులు గడిపిన తనయుడు!
- కోల్ కతాలోని సాల్ట్ లేక్ లో ఘటన
- 21 రోజుల తర్వాత ఖననం చేయాలనుకున్న కొడుకు
- అసలు విషయం బయటపడటంతో రంగంలోకి పోలీస్
పద్దెనిమిది రోజుల క్రితం తల్లి కృష్ణ మృతి చెందింది. తల్లి మృతదేహాన్ని ఖననం చేసే విషయంలో మైత్రేయ తాను నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరించాలనుకున్నాడు. ఈ క్రమంలో 21 రోజుల పాటు ఆ మృతదేహాన్ని ఖననం చేయకుండా ఉంచాలని చూశాడు. అలా, 18 రోజులు గడిపాడు. ఆ తర్వాత తన తల్లి భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు సాయం కావాలంటూ అతను బహిరంగంగా అరవడంతో అసలు విషయం బయటపడింది.
ఈ అరుపులు విన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై మైత్రేయను పోలీసులు విచారణ చేశారు. ఇరవై ఒక్కరోజుల తర్వాత మృతదేహాన్ని ఖననం చేస్తే మంచిదని, అందుకే, ఆ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను ఎంసీఏ చదువుకున్నానని మైత్రేయ చెబుతుండగా, తన చదువును మధ్యలోనే వదిలేశాడని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని అతని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారని పోలీసుల సమాచారం.