చంద్రబాబు ప్రచారం ఖర్చులో సగం డబ్బులు కేటాయించినా ఈపాటికి పోలవరం పూర్తయిపోయేది!: భూమన సెటైర్లు
- జగన్ హోదా కోసం కలిసివస్తామన్నారు
- సంజీవనా? అంటూ చంద్రబాబు ఎకసెక్కాలాడారు
- గేట్లు బిగించడానికి ఇంత ఖర్చా?
సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యవహారశైలిని ప్రజలు ఏకిపారేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రచారానికి చేసుకుంటున్న ఖర్చులో సగం డబ్బు పెడితే ఈపాటికి పోలవరం ఎప్పుడో పూర్తయిపోయేదని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ నేతా ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి, బిగించడానికి అట్టహాసంగా కార్యక్రమాలు చేయరని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏపీ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.