బకెట్ బాంబుల సూత్రధారి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే: యరపతినేని
- పతనావస్థలో ఉన్న వ్యక్తులకు ఇలాంటి నీచ ఆలోచనలే వస్తాయి
- తమ కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు
- రానున్న ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ జెండా ఎగురుతుంది
2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాచర్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని యరపతినేని చెప్పారు. త్వరలోనే జగన్ సీఎం, తాను మంత్రి అని పిన్నెల్లి చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఈ సందర్భంగా నరసింహారావు సోదరుడు యరపతినేని మట్టయ్య మాట్లాడుతూ, తామంతా ఒక తల్లి పిల్లలమని... తమ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బకెట్ బాంబుల అసలు విషయం తేల్చే బాధ్యత పోలీసులదేనని చెప్పారు.