modi: కాంగ్రెస్ పార్టీ దాష్టీకాలకు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు!: ప్రధాని మోదీ

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ పై ప్రధాని మోదీ స్పందించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే... కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పటైన టీడీపీ నేడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటోందని విమర్శించారు.

కాంగ్రెస్ తో కలసి మహాకూటమి ఏర్పాటుకు టీడీపీ యత్నిస్తోందని అన్నారు. తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు, అధికారంలోకి వచ్చేందుకే కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 
Go Back to Shorts
modi
ntr
Telugudesam
bjp
congress

More Telugu News