మిచెల్‌ ఒబామా బూట్ల ఖరీదు రూ.2.8 లక్షలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిచెల్‌ ఒబామా బూట్ల ఖరీదు రూ.2.8 లక్షలు!

  • హైలైట్‌గా నిలుస్తున్న ఆమె ‘హోలో గ్రాఫిక్‌ థై హై’ షూస్
  • ఇప్పుడు నెట్టింట్లో ఇదే వైరల్‌
  • రెండు రోజుల క్రితం ఈ బూట్లతో ఓ కార్యక్రమానికి హాజరైన మిచెల్‌
ఫ్యాషన్‌ ప్రపంచంలో తనదైన అభిరుచితో ప్రత్యేకత చాటుకునే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భార్య మిచెల్‌ ఒబామా ఇప్పుడు అటువంటి ప్రత్యేకతతోనే నెట్టింట్లో ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచారు. రెండు రోజుల క్రితం వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో మిచెల్‌ ధరించిన బూట్లు  ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు ఫ్యాషన్‌ ప్రియులకు తెగ నచ్చేశాయి. వీటి ఖరీదు రూ.2,80,560 (4వేల డాలర్లు) అంటే నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

వేసుకునే దుస్తుల నుంచి చెప్పుల వరకు అన్నింటా ప్రత్యేకత  చాటుకోవడం మిచెల్‌కు అలవాటే అని అంటున్న వారూ ఉన్నారు. తాను రాసిన ‘బికమింగ్‌’ అనే పుస్తకం ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చిన సందర్భంగా మిచెల్‌ పసుపు రంగు దుస్తులు ధరించి ‘హోలోగ్రాఫిక్‌ థై హై’ బూట్లు ధరించారు. వివిధ రంగుల్లో మెరుస్తూ ఇవి కనిపించడం హైలైట్‌గా నిలిచింది. ఇంటర్వ్యూ సందర్భంగా మీడియా ప్రతినిధులు షూస్ గురించి అడిగారు. ‘చూడగానే క్యూట్‌గా అనిపించాయి. వెంటనే డిజైన్‌కు ఆర్డరిచ్చాను’ అని మిచెల్‌ సమాధానం ఇచ్చారు.
America
michel obama
shoes

More Telugu News