సైలెంట్ గా అమెరికాకు వెళ్లిపోయిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!
- పెట్టా షూటింగ్ తర్వాత అమెరికా పయనం
- కంగారు పడుతున్న తలైవా అభిమానులు
- వివరణ ఇచ్చిన రజనీ సన్నిహితవర్గాలు
గతంలోనూ రజనీ తరచుగా అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారనీ, కానీ రోబో 2.ఓ షూటింగ్ కారణంగా అది వాయిదా పడటంతో ఇప్పుడు వెళుతున్నారని స్పష్టం చేశాయి. అభిమానులు కంగారు పడాల్సిన విషయం ఏమీలేదని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది జనవరి 10 వరకూ రజనీ అమెరికాలోనే గడపనున్నారు. ఆయన భారత్ కు తిరిగివచ్చాక మురుగదాస్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ 2019, మార్చి నుంచి ప్రారంభం అవుతుంది.