జనవరి 1 నుంచి రంగంలోకి దిగుతా.. ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్!
- క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను
- అమరావతిలో అందుబాటులో ఉంటాను
- ఫేస్ బుక్ లో జనసేనాని పోస్ట్
సంక్రాంతి సందర్భంగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతానని పేర్కొన్నారు. ఇటీవల జనసైనికులు చేపట్టిన కవాతు ధ్వనితో ఆంధ్రప్రదేశ్ పరవళ్లు తొక్కుతోందని కితాబునిచ్చారు. కొత్త తరాన్ని నిలబెట్టడం కోసం, నవశకాన్ని నిర్మించడం కోసం అందరూ కలిసి రావాలని జనసేనాని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పవన్ తన సందేశాన్ని పోస్ట్ చేశారు.