అసదుద్దీన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
Add ap7am to your home Screen

అసదుద్దీన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

  • అసదుద్దీన్ పై దిగ్విజయ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు
  • నాంపల్లి కోర్టును ఆశ్రయించిన ఎంఐఎం జనరల్ సెక్రటరీ
  • తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. డబ్బు కోసమే అసదుద్దీన్ వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తారని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఎంఐఎం జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది. 
Congress
Asaduddin Owaisi
mim
digvijay singh

More Telugu News